Revanth Reddy: ప్రధాని మోదీ పుట్టకముందు నుంచే తెలంగాణలో రైల్వేస్టేషన్లు ఉన్నాయి: రేవంత్‌రెడ్డి ఫైర్‌

revanth reddy fire on kcr
  • తెలంగాణ ప్రజలకు రైల్వే తెలియదంటూ కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదు
  • ఏడాదిలో ఇళ్లు పూర్తి చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు
  • రాజీవ్ స్వగృహ ఇళ్ల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై, బీజేపీ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డిపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పట్నం గోస పేరుతో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఏడాదిలో ఇళ్లు పూర్తి చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని, ఇప్పటికీ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయకపోవడం సరికాదని విమర్శించారు.

'రాజీవ్ స్వగృహ ఇళ్ల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. తెలంగాణలో నిధులు దారి మళ్లుతుంటే కిషన్‌రెడ్డి ఎందుకు సమీక్ష చేయట్లేదని నిలదీశారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ అంతర్గత సంబంధాలేంటో ప్రజలు తెలుసుకోవాలని సూచించారు. కేసీఆర్‌ ఏ కార్యక్రమం చేపట్టినా రాజకీయ కోణం ఉంటుందని అన్నారు.

ప్రధాని మోదీ పుట్టకముందు నుంచే తెలంగాణలో రైల్వేస్టేషన్లు ఉన్నాయని రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలకు ఎర్రబస్సు తప్ప రైల్వే అంటే ఏంటో తెలియదని, చాలా ప్రాంతాల్లో రైలు సౌకర్యం ఉండేది కాదని ఆయన అనడం సరికాదని చెప్పారు.



Revanth Reddy
Congress
KCR
TRS

More Telugu News