Vijay Sai Reddy: ఆ పక్కనేమో వైజాగ్ సెంట్రల్, ఈ పక్కనేమో కడప కారాగారం, మధ్యలో రాజమండ్రి చెరసాల: విజయసాయి రెడ్డి

Vijayasai Reddy Cetiricle tweets on chandrababu
  • అసలే ఎండాకాలం... ఎలా తట్టుకుంటాడో ఏమో
  • పునీతులని తేలితే ఎవరూ పల్లెత్తు మాటనరు
  • చంద్రబాబు టార్గెట్ గా ట్విట్టర్ లో సెటైర్లు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు జైలుకు వెళ్లే కాలం దగ్గర పడిందని అంటూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయి రెడ్డి, తన ట్విట్టర్ ఖాతాలో సెటైర్లు వేశారు. "ఆ జైలు కెళ్తావా చంద్రన్న, ఈ జైలు కెళ్తావా? ఆ పక్కనేమో వైజాగ్ సెంట్రల్, ఈ పక్కనేమో కడప కారాగారం. నడిమధ్యనున్నది రాజమండ్రి చెరసాల... అని సోషల్ మీడియా కుర్రకారు తెగ ఊగిపోతున్నారు. పాపం అసలే ఎండాకాలం. రెండు ఏసీలేసుకుని పడుకునే వాడు. ఎలా తట్టుకుంటాడో ఏమో?" అని వ్యాఖ్యానించారు.

అంతకుముందు "దమ్ముంటే దర్యాప్తు జరిపించుకోండి. అధికారంలో ఉన్నారు కదా అని నిన్న మొన్నటి వరకు సవాళ్లు విసిరిన వారంతా కుక్కిన పేనులయ్యారు. ఏ తప్పూ చేయలేదనుకుంటే సిట్ ముందుకు వచ్చి మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోండి. పునీతులని తేలితే మిమ్మల్నెవరూ పల్లెత్తు మాట అనరు" అని విజయసాయి అన్నారు.
Vijay Sai Reddy
Twitter
Chandrababu

More Telugu News