Abhiram: 'ఖైదీ'లో చిరంజీవిని కొడుతుంటే.. సినిమా చూస్తూ ఏడ్చేవాడిని: యువహీరో అభిరామ్​

Young Hero Abhiram remembers chiranjeevi khaidi movie
  • ఈ నెల 28న విడుదల కానున్న ‘రాహు’
  • నా చిన్నప్పుడు ‘ఖైదీ’ చూశాను
  • పవన్ కల్యాణ్ కు అభిమానిని   
యువ హీరో అభిరామ్ నటించిన కొత్త చిత్రం ‘రాహు’ ఈ నెల 28న విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో అభిరామ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యూఎస్ లో ఎంబీఏ, ‘థియేటర్’ కోర్సు పూర్తి చేశానని, రెండు ఎంఎఫ్ ఏ చిత్రాల్లోనూ నటించానని, వాటిని ఫిల్మ్ ఫెస్టివల్ కు కూడా పంపించారని గుర్తుచేసుకున్నాడు.

ఆ తర్వాత ఇండియా వచ్చానని, దేవదాస్ కనకాల వద్ద యాక్టింగ్, డ్యాన్స్ నేర్చుకున్నానని చెప్పారు. మోడలింగ్ కూడా చేశానని, 2‌013లో ’మిస్టర్ ఆంధ్రప్రదేశ్‘ గా తాను విజయం సాధించానని, ఆ తర్వాత మోడలింగ్ లో కొంత కాలం కొనసాగానని, అయితే సినిమాపైనే తన ఆసక్తి ఉందని చెప్పాడు. దర్శకుడు తేజ అవకాశం ఇవ్వడంతో ‘హోరాహోరీ‘ మూవీలో నటించానని, ఆ తర్వాత ‘మను’లో యాక్టు చేశానని చెప్పాడు.

తాను చిన్నపిల్లోడిగా ఉన్నప్పుడు ‘ఖైదీ’ చిత్రం చూశానని, అందులో, సూర్యం పాత్రలో నటించిన హీరో చిరంజీవిని కొడుతుంటే ఏడ్చేవాడినని గుర్తుచేసుకున్నాడు. పవన్ కల్యాణ్ కు అభిమానినని,  మహేశ్ బాబు, ప్రభాస్ లు తనను ఎంతో ప్రభావితం చేశారని చెప్పిన అభిరామ్, ఈ నెల 28న ’రాహు’ వస్తున్నాడని, థియేటర్లలో ‘జరా స్పేస్‘ ఇచ్చి, తన సినిమాను సక్సెస్ చేయాలని ప్రేక్షకులను కోరాడు.  
Abhiram
Tollywood
Rahu-movie
Chiranjeevi
Pawan Kalyan

More Telugu News