మూడు రాజధానుల ప్రకటనతో అనేక వ్యాపారాలు హైదరాబాద్ కు తరలిపోయాయి: సీపీఎం నేత మధు
- అమరావతి తరలింపు అంశం అన్ని రంగాల అభివృద్ధిపై పడింది
- రాజధాని తరలింపు అంశాన్ని విరమించుకోవాలి
- చేయని నేరాలకు రైతులపై కేసులు నమోదు చేస్తున్నారు
ప్రభుత్వం తీరుకు నిరసనగా అమరావతి గ్రామాల్లో ఈరోజు బంద్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా సీపీఐ రామకృష్ణ మాట్లాడుతూ, ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న రైతులపై ప్రభుత్వం దౌర్జన్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సీఎం జగన్ రాష్ట్రంలో సమస్యలు సృష్టించి ప్రజలను గందరగోళంలో పడేస్తున్నారని విమర్శించారు.