Panchumarthi Anuradha: సజ్జల రామకృష్ణారెడ్డిపై పంచుమర్తి అనురాధ ఫైర్​

Panchumarthi fires on Sajjala Ramakrishna Reddy
  • దొంగ లెక్కల వీసారెడ్డి స్కూల్ లో శిక్షణ పొందినట్టున్నారు
  • ‘వెలిగొండ’లో 17 కిలో మీటర్లు చంద్రబాబే పూర్తి చేశారు
  • మిగిలిన పనులు పూర్తి చేయకుండానే తప్పుడు లెక్కలు  చెబుతున్నారా?
ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్ పనులు చంద్రబాబు హయాంలో జరిగింది 600 మీటర్లేనన్న వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ స్పందించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గురించి పరోక్ష ప్రస్తావన చేస్తూ సజ్జలపై విమర్శలు గుప్పించారు. దొంగ లెక్కల వీసారెడ్డి స్కూల్ లో శిక్షణ పొందినట్టున్నారని, ‘వెలిగొండ’ తొలి సొరంగం పనులు 18.84 కిలో మీటర్లకు 17 కిలో మీటర్లు చంద్రబాబే పూర్తి చేశారని, మిగిలిన కిలో మీటర్లు పూర్తి చేయకుండానే తప్పుడు లెక్కలు  చెబుతున్నారంటూ మండిపడ్డారు.
Panchumarthi Anuradha
Telugudesam
sajjala Ramakrishna Reddy
YSRCP

More Telugu News