Andhra Pradesh: రాజధాని అమరావతి ప్రాంతంలో రేపు బంద్

Amaravathi JAC calls for Bandh
  • 29 గ్రామాలకు బంద్ పిలుపునిచ్చిన జేఏసీ
  • విద్యా, వ్యాపార సంస్థలు మూసివేయాలని సూచన
  • పోలీసుల తీరుకు నిరసనగా బంద్ చేపడుతున్నట్టు వెల్లడి
ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, రాష్ట్రానికి మూడు రాజధానులు వద్దని గత కొన్నివారాలుగా రైతులు దీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమరావతి జేఏసీ రేపు బంద్ కు పిలుపునిచ్చింది. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో విద్య, వ్యాపార సంస్థలు మూసివేయాలని జేఏసీ సూచించింది. పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ బంద్ కు పిలుపునిచ్చినట్టు వెల్లడించింది.
Andhra Pradesh
Amaravati
Bandh
JAC
Police

More Telugu News