కాసేపు ఒళ్లు వంచితే.. ఢిల్లీ రైల్వే స్టేషన్ లో ఉచితంగా ఫ్లాట్ ఫామ్ టికెట్ ఇస్తారు!
- ఢిల్లీ ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ లో ఫిట్ నెస్ యంత్రం ఏర్పాటు
- దాని ముందు కొద్దిసేపు వ్యాయామం చేస్తే ప్లాట్ ఫామ్ టికెట్ ఫ్రీ
- వీడియో పోస్టు చేసిన రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్
ఇక అసలు విషయానికొస్తే, ఎవరైనా ఆ ఫిట్ నెస్ మెషీన్ వద్దకు వచ్చి కొన్ని నిమిషాల పాటు వ్యాయామం చేస్తే అందులోంచి ఓ ప్లాట్ ఫామ్ టికెట్ ఉచితంగా మీ చేతికి వస్తుంది. రష్యాలో ఎప్పటినుంచో ఈ విధానం అమల్లో ఉంది. అక్కడ 30 సిటప్స్ చేస్తే టికెట్ ఫ్రీ. కాగా, దీనిపై రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ ట్వీట్ చేశారు. ఫిట్ నెస్ తో పాటు పొదుపు కూడా సాధ్యం అంటూ పేర్కొన్నారు. ఈ మేరకు ఓ వీడియో పోస్టు చేశారు.