Hyderabad District: మహిళ తెగువ.. చైన్‌స్నాచర్‌ను పట్టుకుని కుమ్మించిన వైనం!

chainsnacher catched when he was try to snaching
  • మహిళ మెడలో గొలుసు తెంచే ప్రయత్నం 
  • దుండగుడి చెయ్యి పట్టుకున్న బాధితురాలు 
  • ఈడ్చుకు వెళ్తున్నా పట్టు వదలని వైనం

ఆపద వచ్చినప్పుడు సాహసంతోపాటు తెగువ కూడా ముఖ్యం. ప్రమాదం ఎదురైనప్పుడు తెలివిగా వ్యవహరించడం ఎంత అవసరమో తెలియజేసే ఘటన ఇది. ఓ చైన్‌స్నాచర్ చేతివాటం ప్రదర్శనకు సిద్ధమైతే అతన్ని చెయ్యిపట్టి స్థానికులు గుమిగూడే వరకు పట్టువదలకుండా అట్టేపట్టి అతని పీచమణిచిందో మహిళ.

 హైదరాబాద్ శివారు నార్సింగ్ పరిధి జన్వాడ గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే...జన్వాడకు చెందిన ఓ మహిళ నడుచుకుంటూ వెళోంది. దీన్ని గమనించిన ఓ ఆగంతుకుడు పక్కనుంచే వెళుతూ ఆమె మెడలోని గొలుసు తెంచేందుకు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన ఆమె అతని చెయ్యి పట్టుకుంది. ఈలోగా రోడ్డుపై పడిపోయిన తనను ఈడ్చుకుంటూ వెళ్తున్నా ఆమె దుండగుడి చెయ్యి వదలకుండా గట్టిగా కేకలు వేసింది.

ఈలోగా చుట్టుపక్కల వారు గుమిగూడడం గమనించిన చోరుడు గొలుసు వదిలి పారిపోవాలని ప్రయత్నించాడు. అయినా అతనికి ఆ అవకాశం సదరు మహిళ ఇవ్వలేదు. ఈలోగా స్థానికులు దుండగుడిని చుట్టుముట్టి చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.

Hyderabad District
chinsnacher
ladydaring
Police

More Telugu News