shashi tharoor: కార్యకర్తల్లో జోష్ నింపాలి.. అధ్యక్ష ఎన్నికలు నిర్వహించండి: 'సీడబ్ల్యూసీ'కి శశిథరూర్ సూచన

shashi tharoor urges CWC for leadership elections
  • సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న రాహుల్
  • మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్ వ్యాఖ్యలను సమర్థించిన శశిథరూర్
  • అధ్యక్ష ఎన్నికలు వెంటనే నిర్వహించాలని అభ్యర్థన
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపాలంటే అధ్యక్ష ఎన్నికలు నిర్వహించకతప్పదని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి శశిథరూర్ అభిప్రాయపడ్డారు. కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయడంలో పార్టీలోని సీనియర్ నేతలు విఫలమయ్యారన్న మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్ వ్యాఖ్యలను సమర్థించిన శశిథరూర్.. ఈ విషయాన్ని ఆయన నిబ్బరంగా చెప్పారన్నారు. దేశవ్యాప్తంగా పార్టీ నేతలందరూ ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కార్యకర్తల్లో కొత్త శక్తి నింపాలంటే సీడబ్ల్యూసీ వెంటనే అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలని కోరారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం సోనియాగాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు.
shashi tharoor
Congress
CWC

More Telugu News