లేటు వయసులో కొడుకును కనేందుకు ఓ వృద్ధుడి వక్రబుద్ధి!
- కొడుకును కనాలనుకున్న 64 ఏళ్ల వృద్ధుడు
- కృత్రిమ గర్భధారణ పద్ధతిలో బిడ్డను కనేందుకు యువతితో ఒప్పందం
- ఒప్పందాన్ని పక్కనబెట్టి సహజసిద్ధంగా తనతో బిడ్డను కనాలని వేధింపులు
కృత్రిమ గర్భధారణ ద్వారా ఆమె మగబిడ్డను కని స్వరూపరాజ్ కు అప్పగించాలన్నది ఒప్పందం. ఈ ఒప్పందంలో భాగంగా కాన్పు అయ్యేవరకు నెలకు రూ.10 వేలు ఆరోగ్య ఖర్చుల నిమిత్తం చెల్లించాలని ఆ యువతి కోరింది. దానికి కూడా స్వరూపరాజ్ అంగీకరించాడు. అయితే ఆ యువతిని ఇటీవల కలిసిన స్వరూపరాజ్ ఒప్పందాన్ని పక్కనబెట్టి సహజసిద్ధంగా పిల్లవాడ్ని కందాం అంటూ ఆ యువతిని వేధించడం ప్రారంభించాడు. ఆ వృద్ధుడి వక్రబుద్ధిని పసిగట్టిన యువతి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్వరూపరాజ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. పంజాగుట్ట పరిధిలోని ఆనంద్ నగర్ లో ఈ ఘటన జరిగింది.