రైతులపై కేసులు తక్షణమే ఉపసంహరించుకోవాలి: పవన్ కల్యాణ్ డిమాండ్
- క్రిష్ణాయపాలెంలో రెవెన్యూ అధికారులను అడ్డుకున్న రైతులు
- 426 మంది రైతులపై కేసులు నమోదు
- కేసుల నమోదు పుండుపై కారం చల్లినట్టుగా ఉందన్న పవన్
ఓవైపు మూడు రాజధానుల నిర్ణయంతో రాజధాని రైతుల పరిస్థితి అగమ్యగోచరంలా మారితే, ఇప్పుడు భూముల పంపిణీ నిర్ణయం, వారిపై కేసులు నమోదు చేయడం పుండుపై కారం చల్లినట్టుగా ఉందని పవన్ మండిపడ్డారు. తొలిరోజు నుంచి రైతులు శాంతియుతంగా ధర్నాలు చేస్తున్నారని, కానీ ప్రభుత్వం వారితో ఎలాంటి చర్చలు జరపకుండా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాజధాని కోసం దీక్షలు చేపడుతున్న రైతులకు జనసేన పార్టీ మద్దతుగా నిలుస్తుందని ఓ ప్రకటనలో వెల్లడించారు.