Mahesh Babu: ఆ రోజు ఫోన్లో ఆవిడ కూడా మాట్లాడుతుందని అనుకున్నాను!: 'విజయనిర్మల విగ్రహావిష్కరణ' సభలో భావోద్వేగానికి గురైన మహేశ్‌ బాబు

Mahesh Babu gets emotional
  • నా సినిమాలు రిలీజ్ అయిన సమయంలో ఫోన్‌ చేసి మాట్లాడేది
  • సరిలేరు నీకెవ్వరు సినిమా విడుదలయ్యాక నాన్న గారు ఫోన్‌ చేశారు
  • ఆ తర్వాత ఆవిడ మాట్లాడుతుందని నేను అనుకున్నాను.
  • అయితే, ఆమె చనిపోయిందని గుర్తుకొచ్చింది 
ప్రముఖ నటి, దర్శకురాలు దివంగత విజయనిర్మల 74 వ జయంతి సందర్భంగా హైదరాబాద్ శివారులోని నానక్ రామ్ గూడాలోని కృష్ణ, విజయ నిర్మల నివాసంలో.. విజయనిర్మల విగ్రహాన్ని ఆవిష్కరించారు. విజయనిర్మల స్త్రీ శక్తి అవార్డును దర్శకురాలు నందినిరెడ్డికి కృష్ణంరాజు, మహేశ్ బాబు చేతుల మీదుగా ప్రధానం చేశారు. అనంతరం మహేశ్ బాబు మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
         'విజయ నిర్మల గారు చాలా గొప్ప వ్యక్తి. నా సినిమాలు రిలీజ్ అయిన సమయంలో మార్నింగ్‌ షో చూసి నాన్నగారు ఫోన్‌ చేసి మాట్లాడేవారు. తర్వాత ఆవిడ మాట్లాడేది.. శుభాకాంక్షలు తెలిపేది. సరిలేరు నీకెవ్వరు సినిమా విడుదలయ్యాక నాన్న గారు ఫోన్‌ చేశారు. ఆ తర్వాత ఆవిడ మాట్లాడుతుందని నేను అనుకున్నాను.. అయితే, ఆమె చనిపోయిందన్న విషయం తర్వాత గుర్తుకొచ్చింది' అంటూ మహేశ్‌ బాబు బాధపడ్డారు. ఆమె లేని లోటు తనకు గుర్తుకొచ్చిందని చెప్పారు. ఆమె ఏ లోకంలో ఉన్నా సంతోషంగా ఉండాలని ఆయన కోరుకున్నారు.
Mahesh Babu
Tollywood
Vijaya Nirmala Statue

More Telugu News