Kajal Aggarwal: త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాను.. ఇంకా షాక్‌లో ఉన్నాను: హీరోయిన్ కాజల్

kajal about accident in shooting
  • నా హృదయంలోని బాధను బయటపెట్టడానికి మాటలు రావడం లేదు 
  • ప్రమాదం నుంచి తప్పించుకుని ఈ రోజు ట్వీట్ చేస్తున్నాను
  • ఆ క్షణాన నాకు కాలం, జీవిత విలువ తెలిసింది 
నటుడు కమలహాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ‘భారతీయుడు -2’ సినిమా షూటింగ్‌ సందర్భంగా నిన్న క్రేన్ కూలి ఘోర ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నటిస్తోన్న కాజల్ ఈ ఘటనపై స్పందిస్తూ భావోద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు. సినీ బృందంలోని మధు (29), చంద్రన్ (60)తో పాటు సహాయ దర్శకుడు కృష్ణ (34) మృతి చెందడం పట్ల ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

'నా హృదయంలోని బాధను బయటపెట్టడానికి మాటలు రావడం లేదు. నిన్నటి ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. దేవుడు వారికి మరింత ధైర్యాన్నివ్వాలని ప్రార్థిస్తున్నాను. నిన్న రాత్రి జరిగిన క్రేన్ ప్రమాదంపై నేనింకా షాక్ లోనే ఉన్నాను. త్రుటిలో నేను ప్రమాదం నుంచి తప్పించుకుని ఈ రోజు ట్వీట్ చేస్తున్నాను. ఆ క్షణాన నాకు కాలం, జీవిత విలువ తెలిసింది' అని తెలిపింది. కాగా, ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించిన విషయం తెలిసిందే.
Kajal Aggarwal
chennai
Tollywood
Kamal Haasan

More Telugu News