Varla Ramaiah: ఈ గుడ్డి రెడ్డి గారికి స్పందన కన్పించలేదట?: టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్ర వ్యాఖ్యలు

valra ramaiah fires on ycp leaders
  • రస్‌ అల్‌ ఖైమా దెబ్బకి ముద్దాయి-2 విజయసాయిరెడ్డికి మైండ్ చలించింది
  • నిన్న ప్రకాశం జిల్లాలో చంద్రబాబుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు
  • విజయసాయిరెడ్డికి కన్పించలేదట 
  • మీ పార్టీ జాతకం నిమ్మగడ్డ ప్రసాద్ రస్‌ అల్‌ ఖైమాకు మార్చబోతున్నారు  
నిమ్మగడ్డ ప్రసాద్‌ను సెర్బియా పోలీసులు ఏడు నెలల క్రితం అరెస్టు చేశారని, రస్‌ అల్‌ ఖైమా డబ్బును ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ కంపెనీల్లో తాను పెట్టినట్లు నిమ్మగడ్డ అక్కడి అధికారులకు వెల్లడించారని టీడీపీ నేతలు ఆరోపిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ నేత వర్ల రామయ్య వైసీపీ నేతలకు చురకలంటించారు.
 
'రస్‌ అల్‌ ఖైమా దెబ్బకి ముద్దాయి-2 విజయసాయిరెడ్డికి మైన్డ్ చలించింది. నిన్న ప్రకాశం జిల్లాలో చంద్రబాబుకు ప్రజలు బ్రహ్మరథం పడితే, ఈ గుడ్డి రెడ్డిగారికి స్పందన కన్పించలేదట? మంచి కంటి డాక్టర్ కు చూపించుకోండి. మీ పార్టీ జాతకం నిమ్మగడ్డ ప్రసాద్ రస్‌ అల్‌ ఖైమాకు మార్చబోతున్నారు సర్దుకోండి' అంటూ ట్వీట్ చేశారు.
Varla Ramaiah
Telugudesam
Vijay Sai Reddy
YSRCP

More Telugu News