Yuvraj Singh: తాను వెబ్ సిరీస్ లో నటిస్తున్నానంటూ వస్తున్న వార్తలపై స్పందించిన యువరాజ్ సింగ్

Yuvraj Singh clarifies rumors
  • కుటుంబ సభ్యులతో కలిసి యువీ కూడా నటిస్తున్నాడంటూ కథనాలు
  • అవన్నీ అవాస్తవాలేనన్న యువీ
  • వెబ్ సిరీస్ లో నటిస్తోంది తన తమ్ముడని వెల్లడి
క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత యువరాజ్ సింగ్ వెబ్ సిరీస్ ల ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నాడని, ఓ వెబ్ సిరీస్ లో యువీ కుటుంబసభ్యులందరూ నటిస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. యువరాజ్ తో పాటు అతని అర్ధాంగి హేజెల్ కీచ్, తల్లి షబ్నం నటిస్తున్నారని కథనాలు వచ్చాయి. దీనిపై యువీ స్వయంగా స్పందించాడు. వెబ్ సిరీస్ లో తాను నటిస్తున్నానంటూ వస్తున్న వార్తల్లో నిజంలేదని, వాస్తవానికి ఆ వెబ్ సిరీస్ లో తన తమ్ముడు జొరావర్ సింగ్ నటిస్తున్నాడని వెల్లడించారు. ఈ విషయాన్ని అందరూ గమనించాలని ట్వీట్ చేశాడు.
Yuvraj Singh
Web Series
Jorawar Singh
Cricket

More Telugu News