ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కీలక పరిణామం.. ఆరుగురు అధికారులకు బెయిల్
- ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరంపై ఆరోపణలు
- మొత్తం రూ. 305 కోట్ల అవినీతి జరిగిందంటూ సీబీఐ కేసు నమోదు
- మధ్యంతర బెయిలుపై ఉన్న ఆరుగురికి బెయిలు మంజూరు
బెయిలు మంజూరు చేసిన కోర్టు.. తమ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లవద్దని, సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నాలు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. కాగా, యూపీఏ ప్రభుత్వ హయాంలో అప్పటి కేంద్రమంత్రి చిదంబరం ఐఎన్ఎక్స్ మీడియా గ్రూపునకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక క్లియరెన్స్‌ల విషయంలో అవకతవకలకు పాల్పడ్డారని అభియోగాలు నమోదయ్యాయి. మొత్తం రూ. 305 కోట్ల అవినీతి జరిగిందని సీబీఐ ఆరోపించింది. 15 మే 2017న తొలుత సీబీఐ కేసు నమోదు చేయగా, ఆ తర్వాత మనీలాండరింగ్ కింద ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో చిదంబరంతోపాటు ఆయన కుమారుడు కార్తి చిదంబరం కూడా విచారణ ఎదుర్కొంటున్నారు.