రేపు తొలిసారి భేటీ కానున్న అయోధ్య రామజన్మభూమి ట్రస్ట్

First meeting of Ram Janmabhoomi Trust to take place in Delhi on Wednesday
  • ఢిల్లీలో రేపు సాయంత్రం 5 గంటలకు అయోధ్య ట్రస్ట్ సభ్యుల భేటీ
  • ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న ట్రస్ట్ సభ్యులు
  • రామ జన్మభూమి న్యాస్ అధిపతికి ప్రత్యేక ఆహ్వానం
అయోధ్య రామాలయ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు రేపు తొలిసారి భేటీకానుంది. ఢిల్లీలోని కె.పరాశరన్ నివాసంలో ఈ ట్రస్టు సభ్యులంతా భేటీకానున్నారు. సాయంత్రం 5 గంటలకు సమావేశం ప్రారంభం అవుతుంది. ఇప్పటికే ట్రస్టు సభ్యులంతా ఢిల్లీకి చేరుకున్నారు. రామ జన్మభూమి న్యాస్ అధిపతి మహంత్ నృత్యగోపాల్ దాస్ ను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. అయోధ్య రామాలయ నిర్మాణ పనులన్నీ ఈ ట్రస్టు ఆధ్వర్యంలోనే జరగనున్నాయి. ఆలయ నిర్మాణానికి విరాళాలను స్వీకరించేందుకు ట్రస్ట్ పేరుతో ఒక బ్యాంక్ అకౌంట్ ను ప్రారంభించనున్నారు.

Go Back to Shorts
Ram Janmabhoomi Trust
Meeting
Ayodhya Ram Mandir
Ayodhya Temple Trust

More Telugu News