పెళ్లి రోజు సందర్భంగా ప్రియాంకా గాంధీ భావోద్వేగభరిత వ్యాఖ్యలు
- లక్షలాది అందమైన జ్ఞాపకాలు
- ప్రేమ, కన్నీరు, చిరునవ్వు, ఆగ్రహం, స్నేహం
- 6+23 ఏళ్లు గడిచాయి
తన పెళ్లి ఫొటోలతో పాటు తన తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్ గాంధీ, భర్త వాద్రా, పిల్లలు రేహాన్, మిరయాలతో దిగిన ఫొటోలను పోస్ట్ చేశారు. కాగా, గత ఏడాది లోక్‌సభ ఎన్నికల ముందు ప్రియాంక కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి, అధికారికంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఆమెను తన నానమ్మ ఇందిరా గాంధీతో కాంగ్రెస్ కార్యకర్తలు పోల్చుతారు. కాగా, 1997 ఫిబ్రవరి 18న ఆమె పెళ్లి జరిగింది. వాద్రా కూడా తన శ్రీమతికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ చేశారు.