సీటు కోసం మహిళతో గొడవ.. బస్సులోనే కత్తితో పొడిచి పరారైన దుండగుడు
- మహిళల సీటులో కూర్చున్న నిందితుడు
- లేవాలన్నందుకు గొడవ
- చెప్పుతో కొట్టిన మహిళ.. కత్తితో పొడిచిన నిందితుడు
అది మహిళల కోసం కేటాయించిన సీటని, లేవాలని కోరింది. దీంతో మండిపడిన సదరు వ్యక్తి ఆమెపై తిట్ల దండకం అందుకోవడంతో ఘర్షణ మరింత ముదిరింది. ఈ క్రమంలో అతడు ఆమెను అసభ్య పదజాలంతో దూషించాడు. కోపంతో ఊగిపోయిన మహిళ చెప్పుతో కొట్టింది. దీంతో మరింత రెచ్చిపోయిన నిందితుడు జేబులోంచి కత్తి తీసి ఆమె పొట్టలో పొడిచాడు. ఆమె పెద్దగా అరవడంతో డ్రైవర్ బస్సు ఆపేశాడు.
అదే అదునుగా భావించిన నిందితుడు బస్సు దిగి పరారయ్యాడు. బాధితురాలిని నేరుగా అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లిన డ్రైవర్, కండక్టర్ ఘటనపై వారికి ఫిర్యాదు చేశారు. గాయపడిన బాధితురాలిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఘటన బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి రావడంతో జీరో ఎఫ్ఐఆర్ కింద కేసు నమోదు చేశారు.