అవన్నీ ఒట్టి పుకార్లే.. రూ.2 వేల నోటు రద్దుపై కేంద్రం
- ఎటువంటి ఆలోచన లేదన్న ఆర్థిక మంత్రి
- నోట్లు కనిపించక పోవడం వల్లే ఈ భయాందోళన
- రద్దు ఇబ్బంది ఏమీ ఉండదన్న నిర్మలాసీతారామన్
అయితే ఇటీవల కాలంలో 2 వేల నోటు మార్కెట్‌లో అంతగా కనిపించకపోవడంతో రద్దు పుకార్లు మొదలయ్యాయి. రూ.2 వేల నోటును రద్దు చేసే యోచనలో కేంద్రం ఉందని, అందువల్ల రిజర్వ్‌బ్యాంక్‌కు చేరుతున్న నోట్లను చేరినట్టే అట్టేపెట్టేస్తోందని, ఈ కారణంగా మార్కెట్లో నోట్ల చలామణి తగ్గిపోయిందని...ఎవరి నచ్చినట్లు వారు ఊహించుకుంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.
ఎట్టకేలకు కేంద్ర ఆర్థిక మంత్రి దీనిపై క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వం అటువంటి ఆలోచన ఏమీ చేయడం లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు.