Kangana Ranaut: 'తలైవి'లో శోభన్ బాబుగా జిషు సేన్ గుప్తా

Thalaivi Movie
  • జయలలితగా కంగనా రనౌత్ 
  •  ఎంజీఆర్ గా అరవింద్ స్వామి 
  • తెలుగు .. హిందీ భాషల్లోను విడుదల
జయలలిత జీవితచరిత్రగా 'తలైవి' రూపొందుతోంది. ఎ.ఎల్. విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జయలలితగా కంగనా రనౌత్ నటిస్తోంది. ఈ పాత్రను పోషించడం కోసం ఆమె చిన్నపాటి పరిశోధనే చేసిందట. ఈ సినిమాలో ఎంజీ రామచంద్రన్ పాత్రలో అరవింద్ స్వామి నటిస్తున్నాడు. ఇటీవల బయటికి వచ్చిన ఆయన లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక జయలలిత, శోభన్ బాబు మధ్య ప్రత్యేకమైన అనుబంధం వుందని అంటారు. ఆ విషయాలను కూడా ఈ సినిమాలో చూపించనున్నారట. శోభన్ బాబు పాత్ర కోసం బెంగాలీ నటుడు జిషు సేన్ గుప్తాను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'అశ్వద్ధామ'లో జిషు సేన్ గుప్తా ప్రతినాయకుడిగా కనిపించిన సంగతి తెలిసిందే. తమిళంతో పాటు తెలుగు .. హిందీ భాషల్లోను 'తలైవి' విడుదల కానుంది.
Kangana Ranaut
Aravind Swami
Jisshu Sen Gupta
Thalaivi Movie

More Telugu News