Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బస్ లో తనకు దొరికిన క్యాష్ బ్యాగ్ ను జాగ్రత్తగా యజమానికి చేర్చిన కండక్టర్ ప్రవీణ!

Conducter Praveena Returns Cash bag
  • దిల్ సుఖ్ నగర్ డిపోలో పనిచేస్తున్న ప్రవీణ
  • బస్ లో బ్యాగ్ ను మరచిపోయిన ప్రయాణికుడు
  • పోలీసుల సాయంతో బ్యాగ్ తిరిగి అందజేత
తెలంగాణలో దిల్ సుఖ్ నగర్ బస్ డిపోలో కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ప్రవీణ, తనలోని నిజాయితీ, మానవత్వంతో ఇప్పుడు అందరి ప్రశంసలనూ అందుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే, నిన్న సికింద్రాబాద్ నుంచి సరూర్ నగర్ వెళుతున్న సిటీ బస్ లో ప్రవీణ విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఓ ప్రయాణికుడు, తాను దిగాల్సిన స్టేజ్ వచ్చిందన్న తొందరలో తన క్యాష్ బ్యాగ్ ను బస్సులోనే వదిలేసి దిగిపోయాడు.

ఆపై బస్సు గమ్యానికి చేరిన తరువాత ప్రవీణకు ఆ బ్యాగ్ కనిపించింది. తీసి చూడగా, అందులో రూ. 20 వేలకు పైగా నగదుంది. దీంతో ఆమె మలక్ పేట పోలీసులకు సమాచారం ఇచ్చి, వారి సాయంతో బాధితుడికి బ్యాగ్ ను చేర్చింది. పోయిందనుకున్న డబ్బులు వెతుక్కుంటూ వెనక్కు రావడంతో అతను ప్రవీణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రవీణ నిజాయితీని టీఎస్ ఆర్టీసీ అధికారులు, పోలీసులు అభినందించారు.
Praveena
Conductor
Cash Bag
Bus
TSRTC

More Telugu News