రొమాంటిక్ మూవీగా 'కృష్ణ అండ్ హిస్ లీల' .. టీజర్ రిలీజ్
- సిద్ధూ హీరోగా రొమాంటిక్ ఎంటర్టైనర్
- 'క్షణం' దర్శకుడి నుంచి రెండో సినిమా
- వేసవిలో విడుదల చేసే ఆలోచన
'గుంటూరు టాకీస్' ఫేమ్ సిద్ధూ హీరోగా, సురేశ్ ప్రొడక్షన్స్ - వయాకామ్ 18 ఈ సినిమాను నిర్మించింది. శ్రద్ధా శ్రీనాథ్ .. షాలిని .. శీరత్ కపూర్ ఈ సినిమాలో కథానాయికలుగా అలరించనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను రీలీజ్ చేశారు. ముగ్గురు కథానాయికలతో కథానాయకుడు నడిపే ప్రేమాయణం ప్రధానంగా సాగే సన్నివేశాలపై ఈ టీజర్ ను కట్ చేశారు. మే 1వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.