'జరగాలి పెళ్లి మళ్లీమళ్లీ' అనే కాన్సెప్ట్ ను ఆయనను చూసే పెట్టారేమో: నారా లోకేశ్

Nara Lokesh fires on Jagan
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ మరోసారి ట్విట్టర్ ద్వారా మండిపడ్డారు. టీడీపీ తీసుకొచ్చిన కంపెనీలన్నింటినీ వారి ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కియా మోటార్స్ విషయంలో లెటర్ చదువుతూ, అధ్యక్షా అంటూ మంత్రి బుగ్గన బుర్ర కథ వినిపించారని విమర్శించారు. అలాగే, చంద్రబాబుగారి హయాంలో కష్టపడి తెచ్చిన టీసీఎల్ ని కూడా వారి ఖాతాలో వేసుకున్నారని మండిపడ్డారు.

ఇప్పుడు టోరే వంతు వచ్చిందని... చంద్రబాబు ఈ కంపెనీ కోసం ఎంతో కష్టపడి, వారితో ఫాలో అప్ చేసి, తీసుకువచ్చారని నారా లోకేశ్ అన్నారు. టీడీపీ హయాంలో భూమి పూజ అయిపోయిన కంపెనీని, అప్పుడే బిల్డింగులు రెడీ అయిపోయిన కంపెనీని, ఇప్పుడు తామే తెచ్చినట్టు హడావుడి చేస్తున్నారని దుయ్యబట్టారు.

జరగాలి పెళ్లి మళ్ళీమళ్ళీ.. అనే కాన్సెప్ట్ ముఖ్యమంత్రి జగన్ గారిని చూసే పెట్టారేమో అని లోకేశ్ ఎద్దేవా చేశారు. ఎంతో కష్టపడి ఈ కంపెనీ తీసుకువచ్చామని, కియా మోటార్స్ ని బెదిరించినట్టు ఈ కంపెనీని కూడా బెదరగొట్టి తరిమేయకండని హితవు పలికారు.
Go Back to Shorts
Nara Lokesh
Telugudesam
Jagan
Buggana Rajendranath
YSRCP
KIA Motors

More Telugu News