Botsa Satyanarayana Satyanarayana: చిరంజీవి వైసీపీలో చేరుతున్నారా?.. దీనికి బొత్స సమాధానం ఇదిగో!

Botsa answer on Chiranjeevi Joins YSRCP
  • ప్రతిపాదన వస్తే, ఎన్డీఏలో చేరే విషయాన్ని పరిశీలిస్తాం
  • రాష్ట్రం బాగు కోసమే ఏ నిర్ణయమైనా
  • చిరంజీవి చేరితే సముచిత స్థానం ఖాయమన్న బొత్స
నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలవబోతున్నదని, మెగాస్టార్ చిరంజీవి వైసీపీలో చేరనున్నారని నిన్నటి నుంచి వార్తలు వస్తున్న వేళ, ఏపీ పురపాలక శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు.

 తాజాగా విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఎన్డీఏలో చేరాలన్న ప్రతిపాదన వస్తే పరిశీలిస్తామని అన్నారు. తాము బీజేపీకి దగ్గరగా లేమని, అలాగని దూరంగానూ లేమని అన్నారు. రాష్ట్రం బాగుకోసం ఏం చేస్తే మేలు జరుగుతుందో ఆ పని చేసేందుకు తమ అధినేత జగన్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని చెప్పారు.

ఇక చిరంజీవి పార్టీలో చేరే విషయమై మాత్రం ఆయన సూటిగా సమాధానం ఇవ్వలేదు. అది చిరంజీవి ఇష్టమని, ఒకవేళ ఆయన చేరితే, ఆ తరువాత సముచిత స్థానం తప్పకుండా లభిస్తుందని మాత్రం చెప్పారు.
Botsa Satyanarayana Satyanarayana
Chiranjeevi
YSRCP
Jagan

More Telugu News