Anasuya: 'జబర్దస్త్' షో నుంచి తప్పుకోనున్న అనసూయ?

Anasuya
  • పాప్యులర్ కామెడీ షోగా 'జబర్దస్త్'
  • అనసూయకి మంచి క్రేజ్ తెచ్చిన షో 
  • 'లోకల్ గ్యాంగ్'లో సందడి చేస్తున్న అనసూయ  
'జబర్దస్త్' కామెడీ షో కొన్ని సంవత్సరాలుగా నాన్ స్టాప్ గా కొనసాగుతోంది. ఈ కామెడీ షో ద్వారా చాలామంది కమెడియన్స్ పరిచయమయ్యారు .. మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఈ షో ద్వారా అనసూయ క్రేజ్ కూడా ఒక రేంజ్ లో పెరిగింది.  అలాంటి ఈ పాప్యులర్ షో నుంచి అనసూయ తప్పుకోనున్నట్టు తెలుస్తోంది.

'జబర్దస్త్' నిర్వాహకుల నియమం ప్రకారం, ఏక కాలంలో ఎవరూ రెండు షోలలో కనిపించకూడదు. ప్రస్తుతం అనసూయ ఒక వైపున 'జబర్దస్త్' చేస్తూనే, మరో వైపున వేరే చానల్లో 'లోకల్ గ్యాంగ్స్' కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తోంది. 'జబర్దస్త్'లో అనసూయ కొనసాగడానికి ఇప్పుడు ఇదే అభ్యంతరమైందట. అందువలన త్వరలో ఈ కార్యక్రమంలో అనసూయ కనిపించకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.
Anasuya
Jabardasth
Local Gangs

More Telugu News