తిరుమల అశ్విని ఆసుపత్రిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వైవీ
- తిరుమల పుణ్యక్షేత్రంలో అశ్విని ఆసుపత్రికి మరిన్ని హంగులు
- రూ.4 కోట్ల ఆర్థికసాయం అందించిన టాటా ట్రస్ట్
- రోగులకు మరింత మెరుగైన సేవలు
టాటా ట్రస్ట్ సహకారంతో ఇక్కడ కేన్సర్ స్క్రీనింగ్, కేన్సర్ చికిత్స అందించనున్నారు. అపోలో ఆసుపత్రి సౌజన్యంతో హృద్రోగ సంబంధ చికిత్స అందిస్తున్నట్టు వైవీ తెలిపారు. గతంలో అశ్విని ఆసుపత్రిలో ప్రాథమిక పరీక్షల అనంతరం మెరుగైన చికిత్స కోసం తిరుపతి స్విమ్స్ కు పంపించేవారు. ఇకపై చికిత్స అంతా అశ్విని ఆసుపత్రిలోనే అందిస్తారు. 30 పడకలు ఉన్న ఈ ఆసుపత్రిలో 2 ఐసీయూలు, ఓ మినీ ఆపరేషన్ థియేటర్, సరికొత్త ల్యాబ్ ఉన్నాయి.