నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
- చిట్యాలలో జరిగిన ఘటన
- టీవీఎస్ మోపెడ్ ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు
- అక్కడికక్కడే ముగ్గురి మృతి
చిట్యాల శివార్లలో జరిగే ఓ శుభకార్యానికి వీరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. చౌటుప్పల్ మండలం దండు మల్కాపురానికి చెందిన బిక్షపతి, చెన్నారెడ్డి గూడెంకు చెందిన నరసింహ, మరో వ్యక్తి సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. సంఘటనా స్థలాన్ని నల్లగొండ డీఎస్పీ పరిశీలించారు. బస్సు అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.