Nara Lokesh: జగన్‌ ఒక్కరే రాష్ట్రాన్ని ఇలా నాశనం చేశారు: లెక్కలు పోస్ట్ చేసిన నారా లోకేశ్

how Andhra Pradesh is being destroyed single handedly by jagan lokesh
  • 'అప్పుడు, ఇప్పుడు' అంటూ పోస్ట్
  • జీఎస్‌డీపీ, వ్యవసాయం, రాష్ట్ర బడ్జెట్, సేవలు వంటి రంగాల ప్రస్తావన
  • అప్పట్లో వృద్ధి, ఇప్పుడు తిరోగమనమన్న లోకేశ్
'అప్పుడు, ఇప్పుడు' అంటూ జీఎస్‌డీపీ, వ్యవసాయం, రాష్ట్ర బడ్జెట్, సేవలు వంటి రంగాల్లో వృద్ధి, తిరోగమనాన్ని వివరిస్తూ ఉన్న లెక్కలను టీడీపీ నేత నారా లోకేశ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ఒక్కడే ఆంధ్రప్రదేశ్‌ను ఇలా నాశనం చేశారని పేర్కొంటూ ఇందుకు సంబంధించిన లెక్కలను ఆయన వివరించారు.

టీడీపీ హయాంలో (2014-19) 10.32 శాతంగా ఉన్న జీఎస్‌డీపీ, 10.92 శాతంగా ఉన్న వ్యవసాయ వృద్ధి రేటు ఇప్పుడు పడిపోయిందని పేర్కొన్నారు. కేవలం ఆరు నెలల్లో రాష్ట్ర పరిస్థితి ఘోరంగా తయారయిందని ఆయన పోస్టు చేసిన లెక్కల ద్వారా తెలుస్తోంది. 'జగన్‌ ఒక విఫలమైన ముఖ్యమంత్రి' అంటూ లోకేశ్ విమర్శలు గుప్పించారు.
Nara Lokesh
Telugudesam
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News