West Godavari District: ఏలూరు నవాబ్‌పేటలో క్షుద్రపూజలు?: ఓ ఇంటి ముందు ఆనవాళ్లతో కలకలం

  • గుర్తు తెలియని వ్యక్తుల నిర్వాకం
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత కుటుంబం
  • ఆందోళన వ్యక్తం చేసిన స్థానికులు
ఉదయం పడుకుని లేవగానే గుమ్మం ముందుకు వచ్చి చూసిన ఆ కుటుంబం ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది. ఇంటిముందు ముగ్గువేసి ఉండడం, ఆ ముగ్గు మధ్యలో కోడిగుడ్లు పగులగొట్టి ఉండడంతో కాసేపు ఆందోళన చెందారు. ఎవరో తమకు చెడు తలపెట్టేందుకు క్షుద్రపూజలు చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వివరాల్లోకి వెళితే...పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నవాబుపేటలో ఓ కుటుంబం ఉంటోంది. వీరి ఇంటి ముందు గుర్తు తెలియని వ్యక్తులు ఈరోజు తెల్లవారు జామున క్షుద్రపూజు చేసిన ఆనవాళ్లు కనిపించడంతో ఉలిక్కిపడ్డారు. ముగ్గువేసి పూజలు చేసినట్లు ఉండడం, కోడిగుడ్లు పగలగొట్డడంతో ఆందోళన చెందారు. పరిస్థితి చూసి చుట్టుపక్కల కూడా కలకలం రేగింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలికి చేరుకున్నారు.
West Godavari District
Eluru
navabpeta

More Telugu News