యూపీలో రోడ్డు ప్రమాదం: బస్సును ఢీకొట్టిన లారీ.. 13 మంది దుర్మరణం
- ఆగ్రా-లక్నో జాతీయ రహదారిపై గత రాత్రి ఘటన
- ప్రమాద సమయంలో బస్సులో 45 మంది
- తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం యోగి ఆదిత్యనాథ్
బస్సు ఢిల్లీ నుంచి బీహార్‌లోని మోతిహరికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ఉన్నట్టు తెలుస్తోంది. గాయపడిన వారిలోనూ పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.