Nara Lokesh: 'సొంత పార్టీ కార్యకర్తనే ఆదుకోని జగన్‌ గారు'.. అంటూ ఓ వీడియో పోస్ట్ చేసిన లోకేశ్

lokesh fired on ycp leaders
  • మూడు రాజధానులకు మద్దతుగా ర్యాలీకి వెళ్లానంటోన్న వైసీపీ కార్యకర్త
  • నాకు యాక్సిడెంట్ జరిగింది
  • వైసీపీ నేతలు ఎవరూ ఆదుకోవట్లేదు 
  • నా చెప్పుతో నేను కొట్టుకోవాలి 
'సొంత పార్టీ కార్యకర్తనే ఆదుకోని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గారు మూడు రాజధానులు నిర్మిస్తానని అనడం విచిత్రంగా ఉంది. ఆయన మాటలు వైకాపా  పార్టీ కార్యకర్తలే నమ్మే పరిస్థితి లేదు' అంటూ టీడీపీ నేత నారా లోకేశ్ ఓ వీడియోను పోస్ట్ చేశారు.

అందులో వైసీపీ పోస్టర్లను చించేసిన ఆ పార్టీ కార్యకర్త పలు విషయాలు తెలిపాడు. 'మూడు రాజధానులకు మద్దతుగా నేను ర్యాలీకి వెళ్లాను. నాకు యాక్సిడెంట్ జరిగింది. నా కాలు విరిగింది.. వైసీపీ నేతలు ఎవరూ ఆదుకోవట్లేదు. ఇలాంటి వారని తెలియక నేను వారికి మద్దతు తెలిపాను. నా చెప్పుతో నేను కొట్టుకోవాలి' అని ఆయన చెప్పాడు.
Nara Lokesh
Telugudesam
Andhra Pradesh
Viral Videos

More Telugu News