New Delhi: సామాన్యుని ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు: 16న ఢిల్లీ పీఠంపై కేజ్రీవాల్‌

aravind kejrival sworn in as CM on 16th
  • రామలీలా మైదానం వేదిక
  • మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకారం
  • ఇప్పటికే అసెంబ్లీని లాంఛనంగా రద్దు చేసిన లెఫ్టినెంట్‌ గవర్నర్‌
ఢిల్లీ రాష్ట్రంలో జయ కేతనం ఎగురవేసిన ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అధినాయకుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ మూడోసారి పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారైంది. రాష్ట్ర ఎన్నికల్లో 70 సీట్లకుగాను 62 సీట్లు సాధించి ఆప్‌ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఈనెల 16వ తేదీన ఢిల్లీలోని రామలీలా మైదానంలో జరిగే కార్యక్రమంలో ఆయన పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఇప్పటికే లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ లాంఛనంగా అసెంబ్లీని రద్దు చేశారు. ఈరోజు ఉదయం గవర్నర్‌తో కేజ్రీవాల్‌ భేటీ అయ్యారు. 15 నిమిషాలపాటు చర్చించారు. మరోవైపు ఈరోజు ఆప్‌ ఎమ్మెల్యేలు సమావేశమై కేజ్రీని శాసనసభాపక్షం నేతగా ఎన్నుకోనున్నారు. అనంతరం గవర్నర్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి కోరుతారు. ఆ తర్వాత కేజ్రీ తన ముఖ్యమంత్రి పదవికి లాంఛనంగా రాజీనామా చేస్తారు.
New Delhi
aravind kejrival
16th sworn

More Telugu News