విజయ్ దేవరకొండ కోసం భారీ సెట్
- ముంబైలో 'లైగర్' షూటింగ్
- కథానాయికగా అనన్య పాండే
- హిందీ .. తమిళ భాషల్లోను రిలీజ్
ఎక్కువ భాగం షూటింగు ఈ సెట్ లోనే జరుగుతుందట. రేపటి నుంచి ఈ సినిమా షూటింగులో విజయ్ దేవరకొండ పాల్గొననున్నాడు. హీరోలకి మాస్ ఇమేజ్ తీసుకురావడంలోను .. రెట్టింపు చేయడంలోను పూరి సిద్ధహస్తుడు. ఈ సినిమాతో తన క్రేజ్ మరింత పెరుగుతుందని విజయ్ దేవరకొండ భావిస్తున్నాడు. ఈ సినిమాతో తెలుగు తెరకి అనన్య పాండే కథానాయికగా పరిచయం కానుంది. తెలుగుతోపాటు తమిళ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.