జగన్, విజయసాయిరెడ్డిపై వడ్డే శోభనాద్రీశ్వరరావు తీవ్ర వ్యాఖ్యలు

  • రైతుల ఉద్యమంపై ప్రభుత్వ మొండి వైఖరి తగదు
  • సీఆర్డీఏను రద్దు చేయాలన్న జగన్ కుట్ర నెరవేరదు
  • జగన్, విజయసాయి జైలుకు వెళ్లొచ్చినా వారి దోపిడీలు ఆపలేదు
ఏపీ సీఎం జగన్ పై మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు. తుళ్లూరులో రైతుల మహాధర్నాకు ఆయన మద్దతు పలికారు. ఈ సందర్భంగా శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ, రాజధాని రైతుల ఉద్యమం పట్ల ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. సీఆర్డీఏను రద్దు చేయాలన్న జగన్ కుట్ర నెరవేరదని అన్నారు.

అమరావతికి బీజేపీ అండగా ఉంటామని బీజేపీ ప్రకటించినప్పటికీ, ఎంపీ జీవీఎల్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపైనా ఆయన విమర్శలు చేశారు. జగన్, విజయసాయిరెడ్డిలు జైలుకు వెళ్లొచ్చినా వారి దోపిడీలు ఆపలేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Vadde shobanadriswara Rao
Jagan
YSRCP
cm
Vijay Sai Reddy
mp
GVL Narasimha Rao
BJP

More Telugu News