Samsung LED: తెలంగాణ గడ్డపై శాంసంగ్ ఎల్ఈడీ టీవీల తయారీ.... ట్వీట్ చేసిన కేటీఆర్!

Radiant Appliances becomes the first company from Hyderabad to manufacture LED TVs for Samsung
  • గ్లోబల్ మార్కెట్ లీడర్ గా శాంసంగ్ కు గుర్తింపు
  • శాంసంగ్ కోసం టీవీలు తయారుచేస్తున్న రేడియంట్ అప్లియాన్సెస్
  •  హైదరాబాద్ నుంచి ఈ ఘనత సాధించిన తొలి సంస్థ ఇదేనని కేటీఆర్ ట్వీట్
ప్రపంచ మార్కెట్లో నాణ్యత కలిగిన ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీదారుగా దక్షిణకొరియా దిగ్గజం శాంసంగ్ కు ఎంతో పేరుంది. అలాంటి శాంసంగ్ సంస్థ కోసం రేడియంట్ అప్లయాన్సెస్ కంపెనీ ఎల్ఈడీ టీవీలు తయారుచేసి అందిస్తోంది. అదికూడా తెలంగాణ గడ్డ మీదే కావడం విశేషం. దీనిపై మంత్రి కేటీఆర్ సంతోషంతో ట్వీట్ చేశారు.

 "ప్రపంచ విపణిలో అగ్రగామి సంస్థ శాంసంగ్ కోసం ఎల్ఈడీ టీవీలు తయారుచేస్తున్న తొలి హైదరాబాద్ కంపెనీగా రేడియంట్ అప్లయాన్సెస్ అవతరించింది. శాంసంగ్ కోసమే కాదు, ఎంతో పేరున్న ఇతర బ్రాండ్ల కోసం కూడా రేడియంట్ అప్లియాన్సెస్ మహేశ్వరంలోని అత్యాధునిక యూనిట్ లో ఎల్ఈడీ టీవీలు ఉత్పత్తి చేస్తోంది" అంటూ ట్విట్టర్ లో వెల్లడించారు.
Samsung LED
Radiant Appliances
Hyderabad
Maheshwaram

More Telugu News