Buddha Venkanna: రూ.43 వేల కోట్ల ప్రజాధనం దోచిన జగన్ గారూ, ఐటీ దాడుల గురించి మీరు మాట్లాడడం హాస్యాస్పదం: బుద్ధా వెంకన్న

Buddha Venkanna slams YS Jagan and Vijayasai Reddy
షార్ట్స్‌లో చూడండి
తేలు కుట్టిన దొంగలు ఎవరో త్వరలోనే అర్థమవుతుందని, రూ.43 వేల కోట్ల ప్రజాధనం దోచిన వైఎస్ జగన్ గారూ, ఐటీ రైడ్స్ గురించి మీరు మాట్లాడడం ఈ సంవత్సరానికే అత్యుత్తమ జోక్ అంటూ టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు. ఈ సందర్భంగా బుద్ధా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై వ్యంగ్యం ప్రదర్శించారు. విజయసాయిరెడ్డి గారూ, మీరు ఇచ్చిన సమాచారంతో ఐదు రోజుల పాటు తవ్వి, తవ్వి ఎలుకను పట్టారు. ఆ ఎలుకను మీకు గిఫ్టుగా పంపారట, ఇంకా మీకు చేరలేదా? అంటూ ట్విట్టర్ లో ఘాటుగా స్పందించారు.
Go Back to Shorts
Buddha Venkanna
Jagan
Vijay Sai Reddy
IT Raids
YSRCP
Telugudesam

More Telugu News