Gautam Gambhir: ఢిల్లీ ఎన్నికల్లో ఓటమిపై గౌతం గంభీర్ వ్యాఖ్యలు

We accept Delhi election results and congratulate Kejriwal says gambhir
  • ఢిల్లీ ఎన్నికల్లో ఓటమిని మేము అంగీకరిస్తున్నాం
  • ఢిల్లీ ప్రజలకు, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు శుభాకాంక్షలు
  • మేము మా శక్తిమేరకు పనిచేశాం
  • కానీ, ఢిల్లీ ప్రజల్లో నమ్మకం కలిగించలేకపోయామనుకుంటా 
ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు దిశగా దూసుకెళ్తున్న నేపథ్యంలో ఈ విషయంపై బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ స్పందించారు. 'ఢిల్లీ ఎన్నికల్లో ఓటమిని మేము అంగీకరిస్తున్నాం. ఢిల్లీ ప్రజలకు, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు శుభాకాంక్షలు. మేము మా శక్తిమేరకు పనిచేశాం. కానీ, ఢిల్లీ ప్రజల్లో నమ్మకం కలిగించలేకపోయామనుకుంటా. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నేతృత్వంలో ఢిల్లీ అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను' అని గంభీర్ అన్నారు. కాగా, ఆమ్ ఆద్మీ పార్టీ 55 స్థానాల్లో, బీజేపీ 15 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

'నేను ఈ ఫలితాలను అంగీకరిస్తున్నాను. తదుపరి ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం సమర్థవంతంగా పనిచేస్తాం' అని బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ అన్నారు. 'ప్రజల తీర్పు మాకు వ్యతిరేకంగా ఉంది.. దీన్ని మేము అంగీకరిస్తున్నాం. మా పార్టీని శక్తిమంతం చేసుకుంటాం' అని కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసింది.
Gautam Gambhir
elections
New Delhi
AAP

More Telugu News