డేవిడ్ వార్నర్‌కు ప్రతిష్ఠాత్మక అలెన్ బోర్డర్ మెడల్!
- బాల్ ట్యాంపరింగ్‌లో ఏడాదిపాటు నిషేధం
- ఒక్క ఓటు తేడాతో స్మిత్‌ను ఓడించిన వార్నర్
- ఈ సీజన్ తనకు సంతోషాలు తెచ్చిపెట్టిందన్న ఓపెనర్
నిషేధం తర్వాత బ్యాట్‌తో రెచ్చిపోతున్న వార్నర్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా ఈ పతకాన్ని అందజేసింది. మెడల్ అందుకున్న అనంతరం వార్నర్ మాట్లాడుతూ.. చేసిన తప్పుకు గతంలో అందరి ముందు తల వంచుకున్నానని, ఈ సీజన్ తనలో మళ్లీ సంతోషాన్ని తీసుకొచ్చిందని పేర్కొన్నాడు.