PVP: అప్పుడు నోరు మెదపకుండా ఇప్పుడెందుకు వీరావేశం నానీగారు?: పీవీపీ సెటైర్‌

PVP questions kesineni Nani
  • కేశినేనిపై ట్విట్టర్ లో వ్యంగ్యాస్త్రం
  • మీ బాస్‌ చట్టాలను ఉ్లంఘిస్తున్నప్పుడు కుంభకర్ణుడి నిద్ర నటించావు
  • ఇప్పుడేమో తెగ ఊగిపోతున్నావు
ఎంపీ కేశినేని నానిపై వైసీపీ నాయకుడు పొట్లూరి వరప్రసాద్‌ (పీవీపీ) వ్యంగ్యాస్త్రం సంధించారు. మాట్లాడాల్సిన సమయంలో నోరు మెదపకుండా  కుంభకర్ణుడి నిద్ర నటించి ఇప్పుడెందుకా వీరావేశం నానిగారూ? అంటూ ట్వీట్‌ చేశారు.

ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఎ.బి.వెంకటేశ్వరరావుపై రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్‌ వేటు వేశాక ‘తాను అధికారంలోకి రావడానికి పరోక్షంగా కారకుడైన ఏబీవీని జగన్‌ సన్మానించి అభినందిస్తారనుకుంటే ఇలా చేశారేంటి’ అంటూ సెటైరిక్‌గా కేశినేని ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఏబీవీ కూడా డబుల్  కౌంటర్‌ ఇచ్చారు. ఈ అంశంపై చర్చోపచర్చలు నడుస్తున్న నేపథ్యంలో పీవీపీ ఈ ట్వీట్‌ చేశారు.

‘సదరు ఐపీఎస్‌ అధికారి సాయంతో మీ అధినాయకుడు వైసీపీ ఎమ్మెల్యేలను సంతలో గొర్రెలను కొన్నట్లు కొన్నారు. కొందరికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. చట్టసభల ప్రతినిధివై ఉండి ఆ చట్టాలతో చంద్రబాబు చెడుగుడు ఆడుకుంటున్నప్పుడు కుంభకర్ణుడు మాదిరి నిద్రపోయి ఇప్పుడెందుకీ వీరావేశం వీరాభిమన్యా’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. దీనికి నానిగారి సమాధానం ఏమిటో చూడాలి మరి.
PVP
Kesineni Nani
Twitter
ABV

More Telugu News