Amazon: హైదరాబాద్‌లో అమెజాన్ భారీ పెట్టుబడులు!

Amazon to set up two data centers in Hyderabad
  • చందన్‌వల్లి, మీర్‌ఖాన్‌పేటలలో రెండు అతిపెద్ద డేటా సెంటర్లు
  • రూ.11,624 కోట్ల పెట్టుబడి
  • పర్యావరణ అనుమతుల కోసం నిపుణల కమిటీకి పత్రాలు
హైదరాబాద్‌లో రూ.11,624 కోట్ల పెట్టుబడితో రెండు అతిపెద్ద డేటా సెంటర్లు నిర్మించేందుకు టెక్నాలజీ దిగ్గజ సంస్థ అమెజాన్ ముందుకొచ్చింది. శంషాబాద్ మండలంలోని చందన్‌వల్లిలో ఒకటి, హైదరాబాద్ ఫార్మాసిటీ ప్రాజెక్టు పరిధిలోని మీర్‌ఖాన్‌పేటలో మరొకటి ఏర్పాటు చేయాలని అమెజాన్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదన పత్రాలను ప్రభుత్వ నిపుణుల కమిటీ (ఎస్‌ఈఏసీ)కి అందించిన అమెజాన్ ప్రతినిధులు పర్యావరణ అనుమతులు త్వరగా ఇప్పించాలని కోరారు.

అమెజాన్ పెట్టే పెట్టుబడిలో 90 శాతం కంటే ఎక్కువ ఈ రెండు డేటా సెంటర్లలో ఉండే హై-ఎండ్ కంప్యూటర్, స్టోరేజ్ పరికరాల పైనే పెట్టనున్నట్టు సమాచారం. తెలంగాణలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ అభివృద్ధికి ఈ డేటా సెంటర్లు దోహదం చేయనున్నాయి.
Amazon
Data centers
Telangana
Hyderabad

More Telugu News