Odisha: గర్భిణిని జోలెలో మోసుకుంటూ తీసుకెళ్లిన ఒడిశా ఎమ్మెల్యే!

Odisha Mla Carries Pregnent Women for 5 Kms
  • నవరంగపూర్ జిల్లాలో ఘటన
  • రహదారి లేకపోవడంతో రాని అంబులెన్స్
  • మానవత్వం చూపిన ఎమ్మెల్యే
ఏ విధమైన వాహన సదుపాయం లేని ఓ మారుమూల ప్రాంతంలో నిండు గర్భిణి పురుటి నొప్పులతో బాధపడుతుండగా, విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే, దాదాపు 5 కిలోమీటర్ల దూరం ఆమెను జోలెలో మోసుకుంటూ తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘటన ఒడిశాలోని నవరంగపూర్‌ జిల్లా, పపడహండి సమితి సమీపంలోని కుసుముగుడలో జరిగింది.

నెలలు నిండిన జెమ బెహర అనే మహిళకు సోమవారం ఉదయం పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆ గ్రామానికి రహదారి లేకపోవడంతో అంబులెన్స్‌ రాలేని పరిస్థితి. ఈ విషయం తెలుసుకున్న డాబుగాం ఎమ్మెల్యే మనోహర రొంధారి వెంటనే గ్రామానికి వచ్చారు. గ్రామస్తులు ఏర్పాటు చేసిన జోలీలో ఆమెను ఉంచి, మోసుకుంటూ తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్చారు. తమ పట్ల మానవత్వం చూపిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు కృతజ్ఞతలు చెప్పారు.
Odisha
MLA
Pregnent
Carry

More Telugu News