BJP: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌కు రఘునందన్‌రావు లేఖ

BJP leader Raghunandan Rao writes letter to party chief
  • అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న నేత
  • 12 ఏళ్లుగా నరకం చూపిస్తున్నాడంటూ ఫిర్యాదు
  • కోర్టు నుంచి ఊరట లభించే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరం
తెలంగాణ బీజేపీ నేత, ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌రావు ఇకపై పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌కు లేఖ రాశారు. ఓ కేసులో రఘునందన్‌ వద్దకు వెళ్లిన తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, 12 ఏళ్లుగా నరకం చూపిస్తున్నాడంటూ రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని జ్యోతినగర్‌కు చెందిన బాధితురాలు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌ను కలిసి ఇటీవల ఫిర్యాదు చేసింది. ఆమె ఆరోపణలను అప్పుడే ఖండించిన రఘునందన్‌రావు.. తాజాగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.

తనపై వచ్చిన ఆరోపణలకు నైతిక బాధ్యత వహిస్తూ పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు పార్టీ చీఫ్ లక్ష్మణ్, ఇన్‌చార్జ్ కృష్ణదాస్‌కు ఆయన లేఖ రాశారు. ఈ కేసులో కోర్టు నుంచి ఊరట లభించే వరకు ఎటువంటి కార్యక్రమాల్లోనూ పాల్గొనబోనని స్పష్టం చేశారు.  
BJP
Telangana
Raghunandan Rao

More Telugu News