నిఖిల్ గౌడ నిశ్చితార్థ వేడుకలో రాజకీయ నాయకుల సందడి
- కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ నిశ్చితార్థం
- కాంగ్రెస్ నేత కృష్ణప్ప మేనకోడల్ని వివాహం చేసుకోబోతున్న నిఖిల్ గౌడ
- నిశ్చితార్థ కార్యక్రమానికి విచ్చేసిన రాజకీయ, సినీ ప్రముఖులు
ఈ సందర్భంగా కుమారస్వామి వ్యాఖ్యానిస్తూ, హసన్ తన జన్మస్థలం అయినా, తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది రామనగర ప్రాంతమేనని, అందుకే రామనగర, మాండ్య జిల్లాల వారందరినీ తన కుమారుడి పెళ్లికి ఆహ్వానిస్తానని తెలిపారు. కాగా, నిఖిల్ గౌడ సినీ రంగంలోనే కాదు రాజకీయ రంగంలోనూ కాలుమోపారు. అయితే, ఆమధ్య జరిగిన ఎన్నికల్లో సుమలత చేతిలో ఆయన ఓటమిపాలయ్యారు.