Hero Ramcharan: ‘మెగా’ అభిమాని నూర్ బాయ్ కుటుంబానికి హీరో రామ్ చరణ్ సాయం

  • గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన నూర్ బాయ్
  • సాయం కింద రూ.10 లక్షల చెక్కును ఇచ్చిన చరణ్
  • నూర్ బాయ్ కొడుకుకి మంచి ఉద్యోగం ఇప్పిస్తానని హామీ

గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ‘మెగా’ ఫ్యామిలీ వీరాభిమాని నూర్ బాయ్ కుటుంబాన్ని హీరో రామ్ చరణ్ పరామర్శించారు. నూర్ బాయ్ మృతి చెందిన సమయంలో షూటింగ్ నిమిత్తం విదేశాల్లో ఉన్న రామ్ చరణ్ హైదరాబాద్ రాగానే ఆ కుటుంబాన్ని కలుస్తానని చెప్పారు. ఆ మాట ప్రకారం నూర్ బాషా కుటుంబసభ్యులను కలిసి ఓదార్చారు. నూర్ బాయ్ కుటుంబానికి పెద్దకొడుకుగా ఉంటానని చెప్పారు. ఆర్థిక సాయం కింద రూ.10 లక్షల చెక్కును వారికి అందజేశారు. నూర్ బాయ్ కుమారుడికి మంచి ఉద్యోగం ఇప్పిస్తానని, ఇద్దరు కూతుళ్ల వివాహానికి తాను వస్తానని మాట ఇచ్చారు.

  • Loading...

More Telugu News