ఫోర్బ్స్ ఇండియా జాబితాలో నటి సాయి పల్లవి
- ఫోర్భ్స్ ఇండియా 30-అండర్-30 జాబితాలో 27వ స్థానం
- నటన, డ్యాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న నటి
- సోషల్ మీడియాలో అభిమానుల అభినందనల వెల్లువ
కాగా, సాయి పల్లవికి తన అద్భుత నటనకు గాను ఈ గౌరవం దక్కింది. ఈ జాబితాలో ఆమెకు 27వ స్థానం దక్కింది. దీంతో అభిమానులు సామాజిక మాధ్యమాల్లో సాయి పల్లవిని అభినందనలతో ముంచెత్తుతున్నారు. గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉంటూ.. నటనకు ప్రాధాన్యం ఇచ్చే పాత్రలను మాత్రమే ఎంచుకుని మరీ సినిమాలు చేస్తున్న ఈ తమిళ భామ తాజాగా తెలుగులో రానాతో కలిసి ‘విరాటపర్వం’, శేఖర్ కమ్ముల సారథ్యంలో రూపొందుతున్న ‘లవ్ స్టోరీ’ చిత్రంలో నటిస్తోంది.