రామమందిర నిర్మాణానికి మొదలైన విరాళాల సేకరణ.. కేంద్రం విరాళం ఒక్క రూపాయి!
- అన్ని వర్గాలు ఉదారంగా ఆదుకోవాలని వినతి
- నగదు, ఆస్తుల రూపంలో ఇచ్చినా స్వీకరణ
- ఎటువంటి షరతులూ ఉండవని స్పష్టం
దీంతో ఈ ట్రస్టుకు కేంద్ర ప్రభుత్వం రూపాయి విరాళంగా అందించి బోణీ కొట్టింది. ఈ విరాళాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి డి.ముర్ము ప్రభుత్వం తరపున ట్రస్ట్ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ నగదు, ఆస్తుల రూపంలో ఎలా ఇచ్చినా విరాళాలు స్వీకరించనున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం ట్రస్టు కార్యాలయం మాజీ అటార్నీ జనరల్ పరాశరన్ ఇంటి కేంద్రంగా కొనసాగుతోందని, త్వరలో శాశ్వత కార్యాలయం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.