క్రిష్ మూవీలో పవన్ కల్యాణ్ జోడీగా కైరా అద్వాని
- చారిత్రక నేపథ్యంలో క్రిష్ మూవీ
- బందిపోటు పాత్రలో పవన్ కల్యాణ్
- కైరా అద్వానితో జరుగుతున్న సంప్రదింపులు
ఈ సినిమాలో కథానాయికగా ప్రగ్యా జైస్వాల్ పేరును పరిశీలిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ తాజాగా కైరా అద్వాని పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారట. ఆమెకి గల క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని భారీ పారితోషికాన్నే ఆఫర్ చేస్తున్నారట. బాలీవుడ్లో భారీ సినిమాలతో బిజీగా వున్న ఆమె, క్రిష్ సినిమాకి ఓకే చెబుతుందా? లేదా? అనేది చూడాలి. ఇక హరీశ్ శంకర్ తో పవన్ చేయనున్న సినిమాలో కథానాయికగా శ్రుతి హాసన్ ను తీసుకుంటున్న సంగతి తెలిసిందే.