మరోసారి నాని జోడీగా సాయిపల్లవి
- ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్న సాయిపల్లవి
- తదుపరి ప్రాజెక్టుగా రాహుల్ మూవీ
- గతంలో నానితో కలసి 'ఎంసీఏ' సినిమా
నాని కథానాయకుడిగా దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం ఆయన సాయిపల్లవిని ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం నాని - సాయి పల్లవి చేస్తున్న సినిమాలు పూర్తికాగానే, రాహుల్ ప్రాజెక్టు కోసం సెట్స్ పైకి వెళతారట. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందనున్నట్టు చెబుతున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'ఎంసీఏ' ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.