ప్రార్థనాలయాల్లో మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టులో విచారణ గురువారానికి వాయిదా
- శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్లు
- మరికొన్ని పిటిషన్లనూ పరిశీలించిన సుప్రీంకోర్టు
- మత విశ్వాసాల్లో జోక్యం చేసుకునే అంశంలో న్యాయ పరిధిపై విచారణ
- న్యాయవాదులకు సమయం ఖరారు చేస్తామన్న సుప్రీం
విచారణ చేపట్టాల్సిన అంశాల క్రోడీకరణ చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఈ పిటిషన్లపై తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే తెలిపారు. మత విశ్వాసాల్లో జోక్యం చేసుకునే అంశంలో న్యాయ పరిధిపై మాత్రమే విచారణను ఖరారు చేస్తారు. ఈ విషయంపై తమ వాదనలు వినిపించేందుకు న్యాయవాదులకు సమయం ఖరారు చేస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.